AP Budget: ప్రతి ఏటా రైతుకు రూ.20 వేలు
ఇప్పటికే రైతన్నలకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పీఎం కిసాన్ కింద అర్హత కలిగిన రైతన్నలకు రూ.6వేలు జమ చేస్తోంది. కేంద్రం ఇచ్చే రూ.6వేలతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా మరో రూ.14వేలు కలిపి ఏడాదికి రూ.20వేలను పెట్టుబడి సాయంగా రైతన్నలకు అందించనుంది.
ఈ పెట్టుబడి సాయాన్ని మొత్తం మూడు విడతలుగా అందించాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు ఇచ్చేలా నిధులు కేటాయించింది. రైతన్నలకు రూ.20వేలు ఎప్పుడు ఇస్తారో కూడా మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకం మే నెలలో అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది.