అకౌంట్లోకి డబ్బులు.. ఏపీ సీఎం కీలక ఆదేశాలు
దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లో డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు.
పలువురికి డబ్బులు జమ కావడం లేదన్న ఫిర్యాదులపై సమాచారం సేకరించాలని సూచించారు. అటు సిలిండర్ డెలివరీ చేసే సమయంలో డబ్బులు అడుగుతున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ఏజెన్సీలను, అధికారులను సీఎం ఆదేశించారు.