మెగా డిఎస్సీపై సీఎం కీలక ప్రకటన
మెగా డీఎస్సీ, అన్నదాత సుఖీభవపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. త్వరలోనే 16,384 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. రిక్రూట్మెంట్ పూర్తి చేసి, వారికి ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగులు అందజేసిన తర్వాతే పాఠశాలలు ఓపెన్ చేస్తామని తెలిపారు.
ఎన్ని ఇబ్బందులున్నా హామీలు అమలు చేస్తామన్నారు. కేంద్రం తర్వాత విడతలో ఇచ్చే డబ్బుతో కలిపి అన్నదాత సుఖీభవను మూడు విడతల్లో రూ.20 వేలు అందిస్తామని వెల్లడించారు.