ఏపీ అసెంబ్లీ: వైసిపి బాయ్ కాట్.. సభ వాయిదా
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలుత గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం చేశారు. అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మండలి ఛైర్మన్ మోషేన్ రాజు, సీఎం చంద్రబాబు ఆయనను బయట వరకు తీసుకెళ్లి వీడ్కోలు పలికారు.
కాసేపటికే సభను రేపటికి వాయిదా వేశారు. కాగా ఇవాళ సభకు హాజరైన వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేశారు.