భారత్ లో జీతాలు పెరుగుతాయి: ఏఓఎన్ సర్వే
ప్రపంచవ్యాప్తంగా వృద్ధిరేటు తగ్గుతున్నప్పటికీ ఈ ఏడాది భారత్ లో వేతనాలు సగటున 9.2 శాతం పెరుగుతాయని Aon PLC అంచనా వేసింది. ఈ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీస్ సంస్థ 45 రంగాలకు చెందిన 1,400కు పైగా కంపెనీల నుంచి వివరాలు సేకరించింది.
ఆటోమోటివ్, వెహికల్ తయారీ విభాగాల్లో అత్యధికంగా 10.2 శాతం పెంపు ఉండొచ్చని పేర్కొంది. ఆ తర్వాత ఎన్బిఎఫ్సీలో 10 శాతం, రిటైల్ రంగంలో 9.8 శాతం, ఇంజినీరింగ్, రియల్ ఎస్టేట్ రంగాల్లో 9.5 శాతం వేతనాల వృద్ధి ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.