నా కొడుకు మూలన కూర్చుని బాధపడుతున్నాడు: అల్లు అరవింద్
సంధ్య థియేటర్ సంఘటన గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ, హీరో అల్లు అర్జున్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో అల్లు అర్జున్ సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ, అవన్నీ తప్పుడు ఆరోపణలే, హాస్పటల్ ఉన్న బాబు గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, "పుష్ప-2 సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సాధిస్తోంది. ఒక తండ్రిగా నా కొడుకు విజయాన్ని నేను సంతోషిస్తున్నప్పటకీ, బన్నీ మాత్రం గత కొన్ని రోజులుగా ఇదే గార్డెన్ లో ఓ మూలకు కూర్చొని ఎంతో బాధపడుతున్నాడు. సినిమా విజయంతో చాలా సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు, కనీసం బయటకు అయినే వెళ్లు, ఇలానే ఉంటే ఎలా అని నేను బన్నీతో చెప్పాను. కానీ బన్నీ మాత్రం ఎక్కడికీ వెళ్లనని చెబుతున్నాడు. బన్నీని ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది.
ఇప్పుడు అనేక అబద్ధపు ఆరోపణలు రావడంతో అందరికీ స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రెస్ మీట్ నిర్వహించి వివరిస్తున్నట్లు తెలిపారు.