అల్లు అర్జున్ ఎంతటి దుర్మార్గుడంటే... అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

News Published On : Sunday, December 22, 2024 02:30 PM

తెలంగాణ అసెంబ్లీ వేదికగా సంధ్య థియేటర్ ఘటన గురించి ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ, పుష్ప-2 హీరో అల్లు అర్జున్ మీద నిప్పులు చెరిగారు. ఆయన క్యారెక్టర్ గురించి అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట గురించి చెబితే పెద్దగా బాధపడకుండా, సినిమా గురించి మాత్రమే తన సన్నిహితులతో చర్చించిన దుర్మార్గుడు అంటూ అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు. పుష్ప సినిమా రిలీజ్ రోజు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిందని పక్కనున్న వాళ్లు చెబితే.. "అయితే మన సినిమా హిట్ అయినట్లే" అంటూ సంతోషం వ్యక్తం చేసినట్లు సన్నిహితుల ద్వారా తనకు తెలిసిందన్నారు.