నేటి నుండి ఏరో ఇండియా షో

News Published On : Monday, February 10, 2025 08:27 AM

భారత రక్షణశాఖ నిర్వహించనున్న 'ఏరో ఇండియా షో 2025' నేటి నుండి ప్రారంభం కానుంది. బెంగళూరుకు సమీపంలోని యెలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరగనున్న ఈ షోను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేడు ప్రారంభించనున్నారు. ఈనెల 14 వరకు ఈ షోను నిర్వహించనున్నారు.

SU-57, F-35 యుద్ధ విమానాలు ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 150 విదేశీ సంస్థలతో సహా మొత్తం 900 ఎగ్జిబిటర్లతో అతిపెద్ద ఏరో ఈవెంట్గా ఇది నిలవనుంది. 43 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు.