అల్లు అర్జున్.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు లేదంటే తోలు తీస్తాం: ఏసిపి వార్నింగ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హీరో అల్లు అర్జున్ వ్యవహార శైలిపై అసెంబ్లీలో స్పందించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ సైతం మీడియా సమావేశం నిర్వహించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాజాగా ఈ వ్యవహారంలో ఏసీపీ విష్ణుమూర్తి తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఓ రిమాండ్ ఖైదీ అని.. కేసు విచారణ కోర్టులో ఉండగా ముద్దాయి ప్రెస్‌మీట్ పెట్టొచ్చా? అని ప్రశ్నించారు. సంధ్య థియేటర్ వద్ద గ్యాదరింగ్ వద్ద పోలీసులు చెప్పినా అల్లు అర్జున్ వినలేదని ఆరోపించారు.
అల్లు అర్జున్ బాధ్యత పౌరుడిగా ప్రవర్తించలేదని మండిపడ్డారు. సంథ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ బౌన్సర్ల తోపులాటతోనే మహిళా చనిపోయిందన్నారు. బౌన్సర్లతో దౌర్జన్యం కరెక్ట్ కాదని, పబ్లిక్ ప్లేసులలో సెలెబ్రెటీలు బాధ్యతగా వ్యవహరించాలనన్నారు. పోలీసులు తమ విధులను సరిగానే వ్యవహరించారని.. పోలీసులంటే కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. అధికారులను ఇష్టం వచ్చినట్లు తిడితే రీల్స్ కట్ చేస్తామంటూ ఘాటుగా స్పందించారు. అల్లు అర్జున్ డబ్బు మదంతో పోలీసుల మీద అవాకులు చెవాకులు పేలుతున్నారని, విచారణను ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతున్నారని ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తామన్నారు. సినిమా వాళ్ల బట్టలు ఊడతీస్తామని.. మీరు ఉన్నదే లీజు జాగాలో.. జూబ్లీహిల్స్ ఏరియాలో మీకు అంత పెట్టి డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు.
అప్పట్లో ఉన్న రాజకీయ నాయకులు ఎవరో ఇండస్ట్రీ అభివృద్ధి కావాలని మీకు భూములు ఇచ్చారని.. వాపు చూసి బలం అనుకోవదన్నారు. సినిమా వాళ్ల దాదాగిరి ఏంటీ? అని నిలదీశారు. ఇష్టమొచ్చినట్లు టికెట్ రేట్లు పెంచారని.. ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు తీయమని మేము బ్రతిమిలాడామా? అన్నారు. అసలు అల్లు అర్జున్ కి తెలంగాణలో ఆధార్ కార్డు ఉందా? అంటూ ప్రశ్నించారు. పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు అంటున్నావు.. నీకు ఎందుకు చెప్పాలి నువ్వు ఏమన్నా తీస్‌మార్ ఖాన్ అనుకుంటున్నావా? నువ్వు మామూలు పౌరుడివి.. నీకు ఆధార్ కార్డు ఆంధ్రలో ఉందా తెలంగాణలో ఎక్కడ ఉందో కూడా తెలియదన్నారు. అసెంబ్లీలో నీ వల్ల గంట సమయం పోయింది.. నీ గురించి మేము ఎందుకు బాధపడాలన్నారు. తెలంగాణ సమాజం సౌమ్యులు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చేస్తున్నారంటూ స్పందించారు.