ఏసీ కొనే వారికి బ్యాడ్ న్యూస్
ఏసీ కొనే వారికి ఇది ఓ రకంగా బ్యాడ్ న్యూస్. ఏసీ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏసీలకు గిరాకీ పెరుగుతుందని పలు కంపెనీలు అంచనా వేశాయి.
ఎండ తీవ్రత పెరిగి, 25 నుండి 30 శాతం వరకు అధికంగా అమ్మకాలు జరుగుతాయనే ఉద్దేశంతో ఏసీ కంపెనీలు వాటి తయారీ పెంచుతున్నాయి. అయితే ఇందుకు తగ్గట్లు విడిభాగాలు సరఫరా కావడం లేదు. దీంతో ఏసీల ధరలు 4 నుంచి 5 శాతం పెరగొచ్చని తెలుస్తోంది. రకాన్ని బట్టి ఒక్కో ఏసీపై రూ. 1500 నుంచి రూ.2000 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.