80 శాతం ఐటి ఉద్యోగులకు అనారోగ్య సమస్యలు
దేశంలో ఐటీ, దాని అనుబంధ రంగాల్లో 54 లక్షల మంది పని చేస్తుండగా 80 శాతం మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్లు, ఓ ప్రైవేట్ ఆస్పత్రి చేసిన అధ్యయనంలో పలు విషయాలు వెల్లడయ్యాయి.
ఐటి ఉద్యోగుల్లో మరో 71 శాతం మందిని ఊబకాయం సమస్య వేధిస్తోందని ఆ అధ్యయనంలో తేలింది. 34 శాతం మంది షుగర్, బీపీ తదితర సమస్యల బారిన పడే ప్రమాదంలో ఉన్నారని వెల్లడైంది. ఒత్తిడి, పనివేళలు, ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం, నిద్రలేమి వంటి వాటిని అనారోగ్య సమస్యలకు కారణాలుగా గుర్తించారు.