TCSలో 42 వేల ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్
ఈ ఆర్థిక సంవత్సరంలో 42వేల మంది ప్రెషర్లకు ఉద్యోగాలు ఇవ్వాలని టీసీఎస్ నిర్ణయించింది. 2024-25 మాదిరిగానే రిక్రూట్మెంట్ ఉంటుందని సమాచారం. నేషనల్ క్వాలిఫయర్ టెస్టులో ప్రతిభ చూపిన వారిని ప్రైమ్, డిజిటల్, నింజా విభాగాల్లో నియమించుకోనుంది. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 6,07,979 మంది ఉద్యోగులు TCSలో ఉన్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 6,433 మంది మాత్రమే పెరిగారు.