Breaking: ఘోర ప్రమాదం.. 41 మంది మృతి
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం 41 మంది మృతి చెందారు. 48 మందితో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. దీంతో 38 మంది ప్రయాణికులు, ముగ్గురు డ్రైవర్లు అక్కడికక్కడే మరణించారు.
ప్రమాదం అనంతరం బస్సులో మంటలు వ్యాపించి పూర్తిగా తగులబడింది. ప్రస్తుతానికి 18 పుర్రెలు సేకరించామని, మిగతా మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.