క్రేన్ వక్కపొడి అధినేత ఇంట్లో 40 కేజీల బంగారం 100 కేజీల వెండి
గుంటూరులోని క్రేన్ వక్కపొడి కంపెనీ ఛైర్మన్ కాంతారావు నివాసంతో పాటు కార్యాలయాల్లో ఐటీ అధికారులు రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 40 కేజీల బంగారం, 100 కేజీల వెండి, రూ.18 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సంస్థలో భారీగా నల్లధనం చేరుతున్నట్లు ఐటీ శాఖ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. లావాదేవీలపై స్పష్టత కోసం కీలక డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం.