ఏపీలో 10,762 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీ.. నోటిఫికేషన్ వివరాలు
ఏపీలో 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని హోం మంత్రి అనిత అసెంబ్లీలో వెల్లడించారు. త్వరలో 6,100 ఉద్యోగాల నియామకం పూర్తవుతుందని తెలిపారు. మిగిలిన 10,762 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు.
ప్రభుత్వం నుండి అనుమతి రాగానే రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలవుతుందని స్పష్టం చేశారు. పోలీసులు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షల నుండి రూ.15 లక్షలు బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.