ఇంట్లో అందరూ ఒకే సబ్బు వాడితే ఏమవుతుందో తెలుసా..?
చాలా మంది ఇళ్లలో కుటుంబమంతా ఒకే సబ్బును వాడుతుంటారు. కానీ ఇది ప్రమాదకరమని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే అందరూ వాడితే సబ్బుపైకి సాల్మొనెల్లా, షిగెల్లా, స్టాఫ్ బ్యాక్టీరియా, నోరోవైరస్, రోటా వైరస్ చేరే అవకాశముంది. ఒకరి తరువాత మరొకరు వాడితే ఈ వైరస్లు వ్యాపించి చర్మవ్యాధులు, జలుబు వంటి సమస్యలు రావచ్చు. అందుకే ఎవరికి వారు ప్రత్యేక వ్యక్తిగత సబ్బు వాడటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.