బర్డ్ ఫ్లూ విజృంభణ.. చికెన్ తినచ్చా? లేదా?
పలు జిల్లాలను బర్డ్ ఫ్లూ కుదిపేస్తుంది. ఈ నేపథ్యంలో చికెన్, ఎగ్స్ కూడా తినకూడదు అన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రజలు నాన్ వెజ్ జోలికి వెళ్లాలా వద్దా అన్నది సందిగ్ధంలో ఉన్నారు. ముందస్తుగా అనుమానం ఉన్న ప్రాంతాలలో అధికారులు పర్యటించి అక్కడున్న కోళ్లను స్వాధీనం చేసుకుని వాటిని పాతి పెడుతున్నారు.
మరికొన్ని చోట్ల పూర్తిస్థాయిలో అమ్మకాలు సైతం నిలిపివేశారు. అయితే 70 డిగ్రీల వేడిలో ఉడికించి చికెన్ లేదా ఎగ్ ను తింటే ఎలాంటి సమస్యలు తలెత్తవని వైద్యాధికారులు సూచిస్తున్నారు.