రాత్రి ఫోన్ ప్రక్కన పెట్టుకుని పడుకుంటున్నారా..?
సెల్ ఫోన్ మన నిత్య జీవితంలో భాగమైపోయింది. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు సెల్ ఫోన్ ను ఉపయోగిస్తూనే ఉంటాం. ఐతే రాత్రిళ్ళు చాలామంది ఫోన్ పక్కన పెట్టీ పడుకుంటూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ఫోన్ నుండి వచ్చే రేడియేషన్ నిద్రను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి వల్ల చిరాకు,నిరాశ మానసిక రుగ్మతలు వస్తాయని సూచిస్తున్నారు. అలాగే కొన్నిసార్లు ఫోన్ ఓవర్ హీట్ వల్ల పేలే అవకాశం ఉందని హెచ్చతీస్తున్నారు.