రాత్రి లైట్ వేసుకుని పడుకుంటున్నారా?
చాలామందికి రాత్రి లైట్ ఆన్ చేసుకుని పడుకునే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ఉన్న వారికి అనారోగ్య ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చీకటిలో నిద్రపోయే వారి కంటే వెలుగులో నిద్రపోయేవారికి ఊబకాయం ముప్పు ఎక్కువగా ఉంటుందట.
అలాగే చిరాకు, మానసిక కల్లోలం, డిప్రెషన్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులూ వచ్చే ప్రమాదమూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.