మలబద్దకంతో బాధపడుతున్నారా?.. అయితే ఇలా చేయండి

Lifestyle Published On : Monday, March 10, 2025 07:12 AM

చాలా మందికి కొన్నిసార్లు ఏం తిన్నా జీర్ణం కాదు. బ్లోటింగ్ (తేన్పులు), వాంతులు, మలబద్ధకం వంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనికి కారణం గట్ హెల్త్ పాడవ్వడమే. పాత రోజుల్లో ఏం తిన్నా అరిగించుకునేవారు. రాను రాను కల్తీ తిండి దానికి తోడు సరైన ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వంటి కారణాలతో చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో పాటు చాలా మంది డెస్క్ జాబ్స్ చేస్తున్నారు దీంతో రోజులో ఎక్కువశాతం కూర్చునే ఉంటారు. ఇలా ఉండడం వల్లే మొత్తం సమస్య. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే ముందుగా మన గట్‌ని సరిగా కాపాడుకోవాలి. దానికోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

గట్ హెల్త్ బాగుండాలంటే మన జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. యోగర్ట్, ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవాలి. వీటివల్ల నేచురల్‌గానే గట్‌లో హెల్దీ బ్యాక్టీరియా పెరుగుతుంది. అదే విధంగా, షుగర్, ఆల్కహాల్‌ని తగ్గించాలి. వీటి వల్ల కడుపులో చెడు బ్యాక్టీరియా పెరగదు. హాయిగా నిద్రపోవాలి. సరైన నిద్రతో బాడీ రిపేర్ సరిగా జరుగుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవాలి. దీనికోసం మెడిటేషన్, ఎక్సర్‌సైజెస్ చేయొచ్చు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న సమస్య తగ్గకపోతే వైద్య నిపుణులను కలిసి సరైన సప్లిమెంట్స్ తీసుకోవాలి. 

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...