బయట చేసిన ఇడ్లీలు తింటున్నారా..?

Lifestyle Published On : Friday, March 7, 2025 07:42 AM

చాలా మందికి ఇడ్లీ ఫేవరేట్ బ్రేక్‌ఫాస్ట్. ఎందుకంటే హెల్దీ, స్టీమ్‌పై ఉడికిస్తారు, నూనె ఎక్కువగా పట్టదు. అందుకే, ఇడ్లీలకే ఓటేస్తారు. అయితే, వీటిని ఇంట్లో చేసుకుని తింటే పర్లేదు. కానీ బయట కొనుక్కొచ్చి తింటే మాత్రం రోగాలను ఆహ్వానించినట్లేనని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్స్‌ని కొని తెచ్చుకున్నట్లేనట. బయట హోటల్స్‌లో ఇడ్లీలను తయారుచేసేటప్పుడు చాలా మంది ప్లాస్టిక్ షీట్‌పై ఇడ్లీ పిండిని వేసి ఉడికిస్తున్నారు. దీంతో అనేక సమస్యలు వస్తున్నాయి.

సాధారణంగా ఇడ్లీలను ఓ గుడ్డపై పిండి వేసి ఆవిరిపై ఉడికిస్తుంటారు. కొంతమంది వ్యాపారులు గుడ్డకంటే ప్లాస్టిక్ కవర్ వాడడం బెటర్ అనుకుంటున్నారో ఏమో గానీ ప్లాస్టిక్ షీట్ వేసి అందులో ఇడ్లీ పిండి వేసి ఉడికిస్తున్నారు. మంట వేడికి ప్లాస్టిక్ కరిగి అందులోని అవశేషాలు ఇడ్లీల్లోకి చేరిపోతున్నాయి. వీటిని తినడం వల్ల క్యాన్సర్ వంటి సమస్యలొస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి బయట నుండి ఇడ్లీ తెచ్చుకుని తినేటప్పుడు ఎలా చేస్తున్నారో తెలుసుకుని తినడం మంచిది.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...