ఫోన్ వాడితే బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందా?
స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ఐతే ఫోన్ రేడియేషన్ వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందని ఇటీవల ప్రచారాలు జరుగుతున్నాయి. దీనిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాజా స్పష్టత ఇచ్చింది. తాజా అధ్యయనాలపై విశ్లేషణ ఆధారంగా మొబైల్ వాడకంతో మెదడు క్యాన్సర్ కు సంబంధం లేదని స్పష్టం చేసింది. మొబైల్ రేడియేషన్ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందన్నది నిరూపితం కాలేదని వెల్లడించింది. అయితే ఇంకా లోతైన పరిశోధనలు అవసరమని పేర్కొంది.