ఎండాకాలంలో చద్దన్నం తింటే ఏమవుతుందో తెలుసా..
వేసవిలో చద్దన్నం తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు వైద్య నిపుణులు. పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్లు ఉండే చద్దన్నం తినటం వల్ల శరీర వేడి తగ్గి వడదెబ్బనుండి రక్షణ లభిస్తుంది. ఇది డీహైడ్రేషన్, అలసట తగ్గించి తక్షణ శక్తినిస్తుంది. ఉల్లిపాయతో కలిపి తింటే చలువ కలుగుతుంది. బీపీ నియంత్రణ, మలబద్ధకం నివారణ, ఎముకల ఆరోగ్యానికి మేలు, రోగనిరోధక శక్తి పెంపు వంటి ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.