యూట్యూబ్ స్టార్ ఇక లేరు

Entertainment Published On : Tuesday, December 4, 2018 10:48 PM

వందేళ్ల వయసులో చకాచకా వంటలు చేస్తూ యూట్యూబ్ స్టార్‌ అయిన కర్రె మస్తానమ్మ ఇక లేరు. 106ఏళ్ల వయసున్న మస్తానమ్మ సోమవారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా తెనాలికి పదికిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పల్లెటూరుకు చెందిన మస్తానమ్మ గురించి రెండేళ్ల క్రితం వరకూ పెద్దగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆమె తన వంటలతో ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందారు. ఆమె చేసిన పుచ్చకాయ చికెన్‌ను యూట్యూబ్‌లో విపరీతంగా వీక్షించారు. ఎలాంటి సౌకర్యాలు లేకుండా పచ్చని చెట్టు కింద.. పొలం గట్టుపై కట్టెల పొయ్యి మీదే సంప్రదాయ వంటల్ని వండుతూ.. ఈ తరానికి వాటిని పరిచయం చేసిందీ ఈ బామ్మ...దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ మస్తానమ్మకు అభిమానులున్నారు. లండన్‌కి చెందిన బార్‌ క్రాఫ్ట్‌ అనే ఛానల్‌ నుంచి కొందరు వచ్చి మస్తానమ్మ జీవనశైలిని డాక్యుమెంటరీగా తీసుకుని వెళ్లారు.