కార్గిల్ యుద్ధంపై వెబ్ సిరీస్
దేశ చరిత్రలో కార్గిల్ యుద్ధం కీలకమైన ఘటన. ఈ యుద్దంపై నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. పాక్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు వాయుసేన చేపట్టిన 'ఆపరేషన్ సఫేద్ సాగర్' ఘట్టాన్ని ఇందులో చూపిస్తారని సమాచారం.
సిద్ధార్థ్, జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ, మిహిర్ కీలక పాత్రల్లో నటిస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని టాక్ వినిపిస్తోంది.