పూరీ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి సినిమా
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తమిళ హీరో విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమా రాబోతున్నట్లు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పూరీ చెప్పిన కథ సేతుపతిని మెప్పించిందని, సినిమా చేసేందుకు ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది.
డిఫరెంట్ సబ్జెక్ట్ లేదా మంచి కమర్షియల్ కంటెంట్తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంతోనైనా పూరీ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.