జోనర్ మార్చిన వరుణ్ తేజ్
కొంత కాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా జోనర్ మార్చారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కనున్న హారర్ చిత్రంలో ఆయన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు.
ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.