కాంతార-2 షూటింగ్ లో ఊహించని విషాదం
రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న కాంతారా చాప్టర్ 2 సినిమా షూటింగ్ లో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఒక జూనియర్ ఆర్టిస్ట్ మరణంతో సినిమా అకస్మాత్తుగా ఆగిపోయింది. కేరళకు చెందిన ఎంఎఫ్ కపిల్ కొల్లూరు సౌపర్ణిక నదిలో మునిగిపోయాడు. భోజన విరామం తర్వాత నదిలో ఈతకు వెళ్లిన కపిల్ బలమైన ప్రవాహంలో కొట్టుకుపోయాడు. స్థానిక అధికారులు, అగ్నిమాపక శాఖతో కలిసి వెంటనే గాలింపు చర్యల అనంతరం ఆయన మృతదేహాన్ని వెలికితీశారు.