విడాకుల వార్తలపై స్పందించిన హీరో ఆది
తాను విడాకులు తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తలపై టాలీవుడ్ నటుడు ఆది పినిశెట్టి స్పందించారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. తాము సంతోషంగా జీవిస్తుంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తమ స్వార్థం కోసం విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
హీరోయిన్ నిక్కీ గల్రానీని 2022లో ఆది ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన నటించిన 'శబ్దం' ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో చిత్రబృందం పాల్గొంది.