ఆపరేషన్ సింధూర్ పేరుతో సినిమా
పహాల్ ఉగ్రదాడి అనంతరం ఉగ్ర స్థావరాలను అంతం చేసేందుకు భారత ఆర్మీ "ఆపరేషన్ సింధూర్ మిషన్" చేపట్టింది. ఈ క్రమంలో ఆపరేషన్ సింధూర్ పేరుకు ఫుల్ డిమాండ్ నెలకొంది. ఇప్పటికే పలు సంస్థలు ఆపరేషన్ సింధూర్ పేరును రిజిష్టర్ చేయిస్తున్నాయి. తాజాగా ఆర్మీ ధైర్యసాహసాలను చూపించేందుకు ఆపరేషన్ సింధూర్ పేరుతో బాలీవుడ్ లో సినిమా సైతం తెరకెక్కుతోంది. ఈ సినిమాను డైరెక్టర్ ఉత్తమ్ మహేశ్వర్ నిర్మిస్తుండగా, ఆ సినిమా పోస్టర్ ను విడుదల చేశారు.