ఓటీటీలోకి తండేల్ సినిమా
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన 'తండేల్' సినిమా ఓటీటీలోకి రానుంది. మార్చి 7 నుండి Netflixలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో ఈ సినిమా ప్రసారం కానుంది.
చందూ మొండేటి దర్శకత్వంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా రూ.100కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే.