ఓటీటీలోకి తండేల్ సినిమా.. ఎప్పుడంటే..
నాగ చైతన్య, సాయి పల్లవి నటనలో చందూ మొండేటి తెరకెక్కించిన 'తండేల్' సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని రూ.90 కోట్లతో రూపొందించడంతో ఓటీటీ హక్కుల కోసం భారీగానే చెల్లించినట్లు సినీవర్గాల్లో చర్చ సాగుతోంది.
థియేటర్ రెస్పాన్స్ బాగుండటంతో ఈ చిత్రం 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. 'తండేల్'లో నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య సాగే లవ్ స్టోరీ ఆకట్టుకుంటోంది.