తెలుగు బ్యూటీకి భారీ ఆఫర్!
తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కి అవకాశాలు లేవనేది అందరి మాట. అయితే అప్పుడప్పుడు మనవాళ్ళు ఆఫర్లు ఇస్తునే ఉన్నారు. మరి వాటిని తెలుగు అమ్మాయిలు ప్రూవ్ చేసుకోవాల్సిన భాద్యత ఉంది. ఎంతసేపు బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకున్న అందాల మీదనే మోజు పెంచుకుంటున్న వారికి తెలుగు అందం కంటికి ఇంపు కాకపోవడం బాధాకరమే.
మన తెలుగమ్మాయి ఈషా కు లేటేస్ట్ గా మరో ఆఫర్ వచ్చింది. మెగా క్యాంప్ హీరో వరుణ్ సరసన నటించే చాన్స్ ఈ అందాల భామ కొట్టేసింది. వాల్మీకి పేరు మీద వస్తున్న కొత్త సినిమాలో ఈషా రెబ్బాను హీరోయిన్ గా సెలెక్ట్ చేసారని తెలుస్తోంది. హరీష్ శంకర్ డైరెక్టర్ గా ఉన్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. పవన్ తో గబ్బర్ సింగ్, రవితేజాతో మిరపకాయ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చిన హరీష్ ఈ మధ్య కొంత తగ్గాడు. అయినా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అంటూ సాయి ధర్మ తేజ్ తో హిట్ కొట్టాడు. ఇపుడు వరుణ్ తో చేయబోయే వాల్మీకి టైటిల్ కూడా క్యాచీగా ఉంది. ఏదో పవర్ కనిపిస్తోంది. మరి హరీష్ మ్యాజిక్ ఏం చేస్తాడో.
ఇక ఈ మూవీలో ఈషా రెబ్బాను సెలెక్ట్ చేయడం ఇంటెరెస్టింగ్ పాయింటే. ఈ మధ్యన వరుణ్ పక్కన కూడా ముంబై భామలే కనిపిస్తున్నారు. అయితే ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు ఇంపార్టెన్స్ ఉందని అంటున్నారు. పైగా ఈషా అరవింద సమేత, సుబ్రమణ్యపురం వంటి మూవీలో తన టాలెంట్ ప్రూవ్ చేస్తుంది. దాంతో ఆమెకు ఈ మూవీలో ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. మొత్తానికి ఈషా తన టాలెంట్ ఏంటో మరో మారు ప్రూవ్ చేసుకుంటే టాలీవుడ్లో ప్లేస్ దొరికినట్లేనని అంటున్నారు.