శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు, ఆయనే ఏపి ముఖ్యమంత్రి.!
కాస్టింగ్ కౌచ్ వివాదంతో తెర మీదికి వచ్చి, అనేక వివాదాల తర్వాత ఇప్పుడు ఒక సొంత యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆ ఛానల్ ద్వారా అనేక విషయాలపై తన గళమెత్తుతున్న శ్రీరెడ్డి తాజాగా ఏపీ లో జరిగిన ఎన్నికలలో ప్రజలు ఎవరికి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వబోతున్నారో జోస్యం చెప్పింది. టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో హైదరాబాద్ని చాలా బాగా అభివృద్ధి చేశారని, ఐటీ రంగాన్ని కూడా ఆయనే డెవలప్ చేయగలరని యువత ఆకాంక్షిస్తోందని ఆమె చెప్పారు, కానీ టిడిపి లో కొందరు ఎమ్మెల్యేలు చేసిన పనుల వలన టిడిపి పార్టీపై అసంతృప్తి పెరిగిందని, ఇక మరికొందరు చంద్రబాబు పాలన పట్ల సంతృప్తిగానే ఉన్నారని వెల్లడించింది.
టిడిపి ఎమ్మెల్యేలు చేసిన పొరపాట్లు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్కు కలిసి వచ్చేలా ఉన్నాయని, జగన్ కి ఒక్క అవకాశం ఇవ్వటం వలన రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుందని చాలామంది ప్రజలు ఆశిస్తున్నారని,దానికి తోడు చాలా మంది సినీతారలు వైసీపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపడం, జగన్ పాదయాత్ర తదితర అంశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవ్వడానికి జగన్ కు 60 శాతం అవకాశం ఉండగా, చంద్రబాబునాయుడు కు 40 శాతం అవకాశాలు మాత్రమే ఉన్నాయి అని శ్రీ రెడ్డి అన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నదే తన కోరిక అని వెల్లడించింది.