నటికి రన్యా రావుకు షాక్..!
నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆమెకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెతో వివాహ బంధానికి ముగింపు పలికేందుకు భర్త జతిన్ సిద్ధమయ్యారు. ఈ మేరకు కోర్టులో విడాకులకు ఆయన దరఖాస్తు చేశారు.
ఆమెతో పెళ్లైన నాటి నుంచి ఏదో ఒక వివాదం కారణంగా మనశ్శాంతి లేకుండా పోయిందని ఆయన తెలిపారు. మరోవైపు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బెయిల్ కోసం రన్యారావు బెంగళూరు హైకోర్టును ఆశ్రయించారు.