డబ్బంతా జనసేనకే పెట్టేసా.. కనీసం పవన్ తో ఫోటో లేదు: షకలక శంకర్

Entertainment Published On : Thursday, February 27, 2025 04:35 PM

పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జనసేన పార్టీ కోసం తాను ఏమేం చేశాడో జబర్దస్త్ షకలక శంకర్ చెప్పేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ "2019లో సినిమాల్లో నటించినందుకు నాకు రూ.7 లక్షలు వచ్చాయి. అవి తీసుకొని ఇంటికి వెళ్దామనుకునే సమయంలో మావైపు ఒక తుఫాను వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా అక్కడ బాధితులను చూడడానికి వచ్చారు. ఆయన వచ్చి వెళ్లిపోయిన వారం రోజులకు నేను కూడా అక్కడికి వెళ్లాను. రూ.3 లక్షలతో అక్కడ అందరికీ భోజనం ఏర్పాటు చేయించాను. ఆ తర్వాత మిగిలిన డబ్బును ఎన్నికల ప్రచారం కోసం ఖర్చుపెట్టేశాను. చివరికి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాను. దాంతో కోపం వచ్చి నాలుగు రోజులు నా భార్య నాతో మాట్లాడలేదు'' అని చెప్పాడు. 

సొంత డబ్బును పార్టీ కోసం ఖర్చు పెట్టినందుకు వాళ్ళ మావయ్య కూడా చాలా మాటలు అన్నారని, చేయాలనిపించింది చేశాను అని చెప్పేశానని, సినిమా చేసినప్పుడు కూడా కనీసం ఫోటో తీసుకోలేదని, నా సోషల్ మీడియాలో ఎక్కడా పవన్ కళ్యాణ్‌తో ఫోటో ఉండదని తెలిపారు. అభిమానం అనేది మనసులో ఉండాలని, తననా మనసులో ఆయనపై ప్రేమ పర్మనెంట్‌గా ఉండిపోతుంది అంటూ పవన్ గురించి చెప్పాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...