తెలుగు వీర జవాన్ పాత్రలో సల్మాన్ ఖాన్
గల్వాన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు జవాన్ కల్నల్ సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కనుంది. ఇందులో సంతోష్ బాబు పాత్రలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించనున్నట్లు తెలుస్తోంది. అపూర్వ లఖియా దర్శకత్వం వహించే ఈ సినిమా షూటింగ్ జులై నుంచి ప్రారంభం కానుందని సమాచారం. ఈ పాత్ర కోసం సల్మాన్ కసరత్తులు ప్రారంభించారని టాక్ వినిపిస్తోంది.