ఓటిటిలోకి రెట్రో సినిమా
సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన మూవీ `రెట్రో'. ఇటీవల సినిమా తమిళంలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ తెలుగులో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా మూవీ ఓటీటీ విడుదలకు సంబంధించి అప్డేట్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ వేదికగా మూవీ మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.