కిషోర్ తిరుమలతో రవితేజ సినిమా
మాస్ మహారాజా రవితేజ మరో సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 'నేను.. శైలజ', 'చిత్రలహరి' సినిమాల దర్శకుడు కిశోర్ తిరుమల తెరకెక్కించనున్న ఓ సినిమాలో రవితేజ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
యాక్షన్ స్టోరీతో తెరకెక్కే ఈ చిత్రాన్ని చెరుకూరి సుధాకర్ నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, ఏప్రిల్ లేదా మేలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని టాలివుడ్ లో టాక్ నడుస్తోంది.