టాలీవుడ్లో లైంగిక వేధింపులు.. రాశీ ఖన్నా!
రాశీఖన్నా... ఐదు సంవత్సరాల క్రితం ‘ఊహలు గుసగుసలాడె సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తెలిసిందే... ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడినా, అవకాశాలు వస్తూనే ఉండడానికి కారణం వ్యక్తిత్వమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అయితే ఆమె ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో వినపడుతున్న లైంగిక వేధింపులపై స్పందించారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..వేధింపులకు గురౌతున్నవారు ముందుకు వచ్చి దైర్యంగా చెప్పడం చాలా గొప్ప విషయం అన్నారు. ఇలా ముందుకు వచ్చి వారు ఎదుర్కొంటున్న చేదు అనుభవాలను బయటకు వచ్చి నిర్భయంగా చెప్పగలగడం మామూలు విషయం కాదన్నారు. వాళ్ల ధైర్యానికి.. నిజంగా అభినందనించాలని... ‘మీటూ’ అంటూ నాకు చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘ఊహలు గుసగుసలాడె’ సినిమాతో ఇక్కడికి వచ్చినప్పటి నుండి.. ఇప్పటివరకూ నాకైతే.. అన్నీ మంచి అనుభవాలే ఎదురైయాయని అన్నారు. ఇంకా రాశీ ఖన్నా మాట్లాడుతూ.. ‘టాలీవుడ్ ఈజ్ వన్నాఫ్ ది బెస్ట్ ఇండస్ట్రీస్’అని.. ఇక్కడ మహిళ్నీ చాలా గౌరవిస్తారని... అలాగని వేధింపులు కూడా లేవని నేను స్పష్టంగా చెప్పలేనని అన్నారు రాశీఖన్నా. రాశీఖన్నా లేటెస్ట్ హాట్ ఫోటోస్