Rashmika Mandanna: ఆమ్లెట్ లేకుండా ముద్ద దిగదని చెబుతున్న రష్మిక మందన్నా
మలయాళ బ్యూటీ రష్మిక మందన్నా తనకిష్టమైన వంటకాన్ని వండుతూ మరీ అభిమానులకు తెలియజేశారు. అంతేకాదు, ప్రతిరోజు తన డైట్‌లో ఆమ్లెట్ ఉండాల్సిందేనని, అది లేకపోతే ముద్ద దిగదంటున్నారు.
స్టౌ వెలిగించడం దగ్గర నుంచి ఆమ్లెట్ వేయడం వరకు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. చూస్తుంటేనే నోరూరించే విధంగా ఆమ్లెట్‌ను రెడీ చేశారు. "నాకు ప్రతిరోజు ఆమ్లెట్ ఉండాల్సిందే. మీరు కూడా దీన్ని ఓసారి ప్రయత్నించండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి" అని రాసుకొచ్చారు.
కాగా "ఛలో" సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన రష్మిక తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. కుర్ర హీరోలతో పాటు స్టార్ హీరోల సరసన కూడా నటించే ఛాన్సులు కొట్టేస్తున్నారు. ప్రస్తుతం ఆమె 'పుష్ప' సినిమాలో హీరో అల్లు అర్జున్‌కు జోడీగా నటిస్తున్నారు