రష్మిక అడుగుపెడితే రూ.1000 కోట్ల కలెక్షన్స్ పక్కా
పుష్ప ఫేమ్ రష్మిక మందన్న బ్లాక్ బస్టర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. వరుస విజయాలతో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. రష్మిక నటించిన 'పుష్ప', 'పుష్ప-2' కలిపి రూ.2000కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి.
అలాగే రణబీర్ కపూర్ 'యానిమల్' సినిమాలో నటించి కష్టాల్లో ఉన్న బాలీవుడ్ కు సుమారు రూ.1000 కోట్ల సినిమాను అందించారు. ఇప్పుడు విక్కీ కౌషల్ 'ఛావా'తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.