ఫోటోతో పాటు విషయాన్ని బయటపెట్టిన వర్మ
ఎప్పుడూ సంచలనాలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే రామ్ గోపాల్ వర్మ, సినిమాల పరంగానూ బిజీగానే ఉన్నారు. ఎవరేమనుకున్నా తనకు నచ్చింది కెమెరాలో బంధించేయడం వర్మ నైజం. ఈ నేపథ్యంలోనే తన తాజా సినిమా విశేషాలను తెలుపుతూ వైజాగ్ బీచ్ పేరెత్తారు. అంతేకాదు ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పారు. ఇంతకీ ఏంటా విషయం? ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు లాంటి పొలిటికల్ టచ్ ఉన్న సినిమాలు తీసి సంచలనం సృష్టించిన వర్మ, ఈ సారి ట్రాక్ చేంజ్ చేశారు. తొలిసారి ఓ అద్భుతమైన ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.