పవన్ కళ్యాణ్ OG గురించి రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "OG" మూవీ గురించి హీరో రామ్ చరణ్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. అభిమానులుగా OG మూవీ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలంటే కష్టమే.. కానీ ఇంట్లో మనిషే అయిన రామ్ చరణ్ కూడా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ మూవీ కోసం తను కూడా ఎదురు చూస్తున్నాని చెప్పారు. అమెరికాలో గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈ సంక్రాతి నా సినిమా లేకపోతే అతి బలవంతంగా అయినా బాబాయ్ చేత OG సినిమా ఈ సంక్రాతికే రిలీజ్ చేయించే వాడినని చెప్పుకొచ్చారు. దాదాపుగా ఐదేళ్ల తర్వాత నేను సోలోగా నటించిన చిత్రం గేమ్ ఛేంజర్ తో మీ ముందుకు వస్తున్నాను. ఈ మూవీలో సాంగ్స్, ఫైట్సే కాదు అన్నీ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.