సమంత శుభం సినిమాపై రామ్ చరణ్ ఆసక్తికర ట్వీట్
నటి సమంత హీరోయిన్ గా రాణిస్తూనే "శుభం" నిర్మించి నిర్మాతగా మారింది. ఈ సినిమా ఈ నెల 9 న విడుదలై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను చూరగొంది. తాజాగా సినిమాపై హీరో రామ్ చరణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. "శుభం ట్రైలర్ చూస్తే చాలా ఫన్ గా అనిపిస్తోంది. ఈ సినిమాను నా కుటుంబంతో కలిసి చూడడానికి ఏమాత్రం ఆగలేకపోతున్నాను. ఇలాంటి యూనిక్ సినిమాలను మనం తప్పక ప్రోత్సహించాలి. చిత్ర యూనిట్ అందరికీ కంగ్రాట్స్" అని రామ్ చరణ్ ట్వీట్ లో పేర్కొన్నారు.