నన్ను ఇబ్బంది పెట్టవద్దు. నేను రాజకీయాల్లోకి రాను : రజినీకాంత్

Entertainment Published On : Wednesday, March 10, 2021 02:00 PM

Chennai, Jan 11: ర‌జినీకాంత్‌ రాజ‌కీయాల్లోకి రావాల్సిందేనంటూ అభిమానులు ఆదివారం చెన్నైలో భారీ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించ‌డంపై ఆయ‌న స్పందించారు. దయచేసి నన్ను నొప్పించకండి.." అంటూ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులకు విజ్ఞప్తి (Rajinikanth emotional letter) చేశారు. ‘‘నేను కారణాలు ముందే వివరించా. నా నిర్ణయం చెప్పేశా.  ఇక ఈ విషయమై నన్ను ఇబ్బంది పెట్టొంది. రాజకీయాల్లోకి రావాలని మళ్లీ మళ్లీ అడిగి నొప్పించవద్దు.’’ అని రజనీకాంత్‌ ఓ లేఖ (Rajinikanth Emotional Letter To Fans) విడుదల చేశారు.

ఇక రాజకీయాల్లోకి రావాలని.. మీరు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని వస్తున్న విజ్ఞప్తులపై కొంత ఆవేదన చెందుతూ రజనీ (Rajinikanth) తన నిరాసక్తతను వ‍్యక్తం చేశారు. అనారోగ్యం నుంచి కోలుకున్న అనంతరం తాను రాజకీయాల్లోకి రాను అని డిసెంబర్‌ 30వ తేదీన సంచలన ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. తమిళ రాజకీయ పార్టీలు కొంత ఊపిరి పీల్చుకున్నాయి.  ఈ క్రమంలో ‘మీరు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని.. రాజకీయాల్లోకి రావాలని’ అభిమానులు కోరుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం (జనవరి 10) అభిమానులు ధర్నా చేశారు. తమ నిర్ణయం మార్చుకోవాలని.. రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. దీంతో రజనీకాంత్‌ సోమవారం ట్విట్టర్‌ వేదికగా లేఖను విడుదల చేశారు.   

ర‌జినీ మ‌క్క‌ల్ మండ్రమ్ (Rajini Makkal Mandram) నుంచి బ‌హిష్క‌రణ‌కు గురైన శ్రేణుల‌తో క‌లిసి త‌న అభిమానులు కొంద‌రు ఆదివారం చెన్నైలో ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించార‌ని, రాజకీయాల్లోకి రానంటూ తాను తీసుకున్న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని ఆ ప్ర‌ద‌ర్శ‌న‌లో డిమాండ్ చేశార‌ని ర‌జినీకాంత్ గుర్తుచేశారు. అయితే, తాను తీసుకోవాల్సిన నిర్ణ‌యం ఇప్ప‌టికే తీసుకున్నాన‌ని, ఇక ఆ నిర్ణ‌యాన్ని మార్చుకునే ఆలోచ‌న లేద‌ని తెలిపారు. 'నేను ప్ర‌తి ఒక్కరికీ విజ్ఞ‌ప్తి చేస్తున్నా.. నేనంటే గిట్ట‌ని వాళ్లు చేసే ఇలాంటి ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో ద‌య‌చేసి పాలుపంచు‌కోకండి' అని త‌న‌ అభిమానుల‌ను ఉద్దేశించి ర‌జినీకాంత్ వ్యాఖ్యానించారు. అలాంటి ఘ‌ట‌న‌లు త‌నను బాధిస్తాయ‌ని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.