రాజమౌళి, మహేశ్ బాబు మూవీ క్లిప్ లీక్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ లీక్ అయినట్లు తెలుస్తోంది.
అందులో మహేశ్ బాబుతో యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంత ప్రతిష్ఠాత్మకమైన సినిమాకు లీకుల కష్టం ఏంటని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమా బృందం అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.