సినిమాలు వదిలేస్తున్నా... డైరక్టర్ సుకుమార్
అమెరికాలో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్లో సుకుమార్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో సినిమాలోని ‘ధోప్’ అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాట గురించి మాట్లాడుతున్న సమయంలో, యాంకర్ సుమ సుకుమార్ ను..' మీరు ఒకవేళ 'ధోప్' ' (వదిలిపెట్టడం అని అర్థం) అని వదిలేయాలి అంటే ఈ రోజుతో ఏం వదిలేస్తారు అని అడిగితే.. సుకుమార్ ఏకంగా 'సినిమాని వదిలేద్దాం అనుకుంటున్నా' అని చెప్పాడు.
దీంతో పక్కనే కూర్చున్న రామ్ చరణ్ షాకయ్యాడు. అనంతరం సుకుమార్ దగ్గర మైక్ లాక్కొని 'అలా చేయరులే' అని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతోంది. దీన్ని చూసి నెటిజన్స్..' ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల సుకుమార్ బాగా డిస్ట్రబ్ అయ్యి ఇలాంటి కామెంట్ చేసినట్లు ఉన్నాడంటూ అభిప్రాయపడుతున్నారు.
Papam ra SUKKU 😢
— Negan (@Negan_000) December 23, 2024
Waiting for your huge comeback with RC17 ♥️🔥#RamCharan𓃵 #Pushpa2TheRule#Sukumar #RC17pic.twitter.com/LyeJMBPCDK