పూరీ - అఖిల్ కాంబినేషన్ లో సినిమా..?
అక్కినేని అఖిల్ ప్రస్తుతం లెనిన్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాని తర్వాత అఖిల్ పూరీ జగన్నాథ్ తో ఓ సినిమా చేసే అవకాశం ఉందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.
పూరీ కూడా ఫ్లాపుల్లోనే ఉన్నా హీరోలకు మేకోవర్ ఇవ్వడంలో ఆయన స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ నేపథ్యంలో అఖిల్ కోసం మంచి మాస్ స్టోరీని రెడీ చేయమని నాగార్జున పూరీకి సూచించినట్లు సినీ వర్గాలంటున్నాయి. నాగ్ పూరీ సూపర్, శివమణి సినిమాలు తీసిన సంగతి తెలిసిందే.