ప్రభాస్ సినిమా.. ఒకరు ఇన్.. ఒకరు ఔట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం 'స్పిరిట్' గురించి ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కథానాయికగా తొలుత బాలీవుడ్ అగ్రతార దీపికా పదుకునేను ఎంపిక చేశారు. అయితే, తాజా సమాచారం ప్రకారం, కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో కన్నడ నటి రుక్మిణి వసంత్ ను తీసుకునే ఛాన్స్ ఉంది.